మన రెబల్‌స్టార్ ప్రభాస్ రేంజ్.. బాహుబలి సినిమాతో విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. జపాన్, చైనా, పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఫ్యాన్సీ ఆడ్స్ అనే సంస్థ.. ఆసియా ఖండంలో అందగాడు ఎవరు? విషయంపై ఓ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో ప్రభాస్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆసియా మొత్తానికి అందగాడు ప్రభాస్ యేనని ఈ సంస్థ ప్రకటించింది. ఫ్యాన్సీ ఆడ్స్ సంస్థ ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మెన్’ సర్వేలో ప్రభాస్ టాప్‌లో నిలించాడు.
సౌత్ కొరియన్ స్టార్ కిమ్ హ్యూన్ జూంగ్, పాకిస్తాన్ నటులు ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ తదితరులు ఓ పోల్‌లో ప్రభాస్‌తో పోటీపడ్డా.. ప్రభాస్ టాప్‌లో నిలిచాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, రాధాకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్అశ్విన్తో మరోసినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇందులో లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడని టాక్. ఇక ఆదిపురుష్, సలార్ షూటింగ్ కూడా ఇప్పటికే షూటింగ్ నడుస్తుండగా ఇవాళ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.
Also Read
సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!
మునుపెన్నడూ లేనంతగా బాలయ్య లైనప్..!