Monday, May 6, 2024
- Advertisement -

ఆసియా ఖండంలో అందగాడు ఎవరో తెలుసా..?

- Advertisement -

మన రెబల్​స్టార్​ ప్రభాస్​ రేంజ్​.. బాహుబలి సినిమాతో విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. జపాన్​, చైనా, పాకిస్థాన్​ వంటి దేశాల్లో కూడా ప్రభాస్​కు ఫ్యాన్స్​ ఉన్న విషయం తెలిసిందే. ఫ్యాన్సీ ఆడ్స్‌ అనే సంస్థ.. ఆసియా ఖండంలో అందగాడు ఎవరు? విషయంపై ఓ పోల్​ నిర్వహించింది. ఈ పోల్​లో ప్రభాస్​కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆసియా మొత్తానికి అందగాడు ప్రభాస్​ యేనని ఈ సంస్థ ప్రకటించింది. ఫ్యాన్సీ ఆడ్స్‌ సంస్థ ‘టాప్‌ టెన్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ ఏసియన్‌ మెన్‌’ సర్వేలో ప్రభాస్‌ టాప్​లో నిలించాడు.

సౌత్‌ కొరియన్‌ స్టార్‌ కిమ్‌ హ్యూన్‌ జూంగ్‌, పాకిస్తాన్‌ నటులు ఇమ్రాన్‌ అబ్బాస్‌, ఫవాద్‌ ఖాన్‌ తదితరులు ఓ పోల్​లో ప్రభాస్​తో పోటీపడ్డా.. ప్రభాస్​ టాప్​లో నిలిచాడు. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్​ పలు పాన్​ ఇండియా పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఓం రౌత్​ దర్శకత్వంలో ఆదిపురుష్​, రాధాకృష్ణ డైరెక్షన్​లో రాధేశ్యామ్​, కేజీఎఫ్​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో సలార్​, నాగ్​అశ్విన్​తో మరోసినిమాను ప్రభాస్​ చేస్తున్నాడు. రాధేశ్యామ్​ ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్నది. ఈ సినిమా పిరియాడికల్​ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రభాస్​ ఇందులో లవర్​ బాయ్​గా కనిపించబోతున్నాడని టాక్​. ఇక ఆదిపురుష్​, సలార్ షూటింగ్​ కూడా ఇప్పటికే షూటింగ్ నడుస్తుండగా ఇవాళ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.

Also Read

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

మునుపెన్నడూ లేనంతగా బాలయ్య లైనప్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -