రెబల్ స్టార్ ప్రభాస్ కు ఒక్కసారిగా వచ్చిన రెండు ఆఫర్లు…. అతన్ని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో మొదటిది మహేంద్ర XUV 500 కార్ కు బ్రాండ్ అంబాసిడార్ గా వ్యవహరించే ఛాన్స్ రావడం, రెండవది నీల్ నితిన్ ముఖేష్ తోకలిసి మురగదాస్ డైరెక్షన్లో సైంటిఫిక్ థ్రిల్లర్ చేసే అదృష్టం వరించడం.
స్వయంగా మహేంద్ర గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి ఆనంద్ మహేంద్ర బాహుబలిని చూసి థ్రిల్ అయ్యారట.వెంటనే తమ XUV 500 కార్ ప్రమోషన్ కు ప్రభాస్ అయితే కరెక్ట్ గా స్యూట్ అవుతారని ఫీల్ అయ్యారట. ఇక డీల్ ఎంతనేది కరెక్ట్ గా ఫైనలైజ్ కాలేదు గాని ప్రభాస్ కు మాత్రం ఆ ఎమౌంట్ ఫిగర్ చూసి మైండ్ బ్లాంక్ అయిందట. ఎందుకంటే ఇప్పటి వరకూ సౌత్లో ఏ నటుడికి ఇంతటి పెద్ద రెమ్యునిరేషన్ వచ్చిన యాడ్ మరొకటి లేదు.
ఇక నీల్ నితిన్ విషయానికొస్తే…అతనే స్వయంగా అధికారికంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు.దీన్ని బట్టి బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సుజిత్ తో సినిమా చేయడం లేదు.అతని దృష్టి అంతా….ఇపుడు బిటౌన్ వెంచర్ పైనే ఉంది. ఈసినిమా మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్నాడు కాబట్టి తమిళం,హిందీ,తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోకి డబ్ కావచ్చు.టైమ్ అంటూ రావాలి గాని లేటైనా అన్నీ దానంతట అవే వస్తాయనే మాట ప్రభాస్ విషయంలో కనిపిస్తుంది.