Monday, May 6, 2024
- Advertisement -

లేని ల‌వ‌ర్‌ను ఎక్కడి నుంచి తెమ్మంటారు

- Advertisement -
  • ఈ ఏడాది పెళ్లి చేసుకోడంట‌
  • పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ

బాహుబలి సినిమాతో హ‌లీవుడ్ దాక వెళ్లియిన తెలుగు న‌టుడు ప్రభాస్. ప్ర‌భాస్ ఇప్పుడు జాతీయ‌స్థాయిలో గుర్తు ప‌ట్టేంత న‌టుడిగా మారిపోయాడు. ఐదేళ్ల పాటు బాహుబ‌లికి త‌న జీవితాన్ని అంకింతం చేసిన ప్ర‌భాస్ సినిమా పెళ్లిపైన ప్ర‌ధాన ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడ‌ని అత‌డి అభిమానులే కాదు ఆంటీలు, యువ‌తులు కూడా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. స్వ‌యంవ‌రం ప్ర‌క‌టిస్తే వేలాది మంది క్యూలో ఉంటార‌న‌డంతో అతిశ‌యోక్తి కాదు.

ఇప్పుడు పెళ్లి గురించే సాహో షూటింగ్‌లో ఉన్న ప్రభాస్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడాడు. తనకు అనుష్కకు పెళ్లి జరగబోతోందని మీడియాల వ‌స్తున్నవి పుకార్లు అని కొట్టి పారేశారు. అలా ఎలా ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడం లేదని బాధ‌ప‌డ్డాడు. తాను అనుష్క గొప్ప స్నేహితులమే తప్ప పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్ప‌ష్టం చేశాడు. ఒక జంట వరసగా సినిమాల్లో నటించి బయట సన్నిహితంగా మెలిగినప్పుడు ఇలాంటి ప్రచారం జరగడం సహజమని, ఈ సంవత్సరం 2018లో కూడా తన పెళ్లి లేదని తేల్చేశాడు.

ప్రభాస్ పెళ్లి గురించి ఇటీవ‌ల పెద‌నాన్న కృష్ణంరాజు ప్ర‌భాస్ ఓకే అంటే చాలు మా ప‌నిలో ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. అయితే తాను ఇప్ప‌టికి సిద్ధంగా లేన‌ని ప్ర‌క‌టించాడు. ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తాను ఎవరిరినీ ప్రేమించ‌డం లేద‌ని చెప్పాడు. ఏదైనా ఉంటే తానే చెప్పేవాడిని అని, లేని గర్ల్ ఫ్రెండ్‌ని ఎక్కడి నుంచి తెమ్మంటారు అని ఎదురు ప్ర‌శ్నించాడు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సాహో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దుబాయ్‌లో అనుమ‌తి రాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోంది. అనుమ‌తి ల‌భించిన వెంట‌నే దుబాయ్‌లో స్టంట్ మాస్టర్ కెన్ని బేట్స్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తారంట‌. ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆషికీ-2 హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -