Thursday, May 2, 2024
- Advertisement -

టీ20ల్లో అరుదైన రికార్డ్… మూడు మూడు శ‌త‌కాల‌తో ప్ర‌పంచ రికార్డ్ సృష్టించిన కొలిన్ మ‌న్రో.

- Advertisement -

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కొలిన్‌ మున్రో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో శతకం బాదాడు. ఈ మూడు సెంచరీలను మన్రో గత 12 నెలల్లోనే చేయడం అతడి దూకుడుకి అద్దం పడుతోంది.

గతేడాది జనవరి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో మున్రో (101) తొలి సెంచరీ కొట్టాడు. నవంబర్‌ 4న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 109 పరుగులతో అజేయంగా నిలిచి రెండో శతకాన్ని సాధించాడు. తాజాగా మూడో సెంచరీ చేసి ఇంటర్నేషనల్‌ టి20 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు

మున్రో వీరవిహారం చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. మార్టిన్ గప్టిల్ (33 బంతుల్లో 63), మన్రో (53 బంతుల్లో 104; 3×4, 10×6) మొదటి వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 136 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ రెండు వికెట్లు తీశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -