Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబలి-2 మీద వస్తున్న రూమర్స్‌ని కొట్టిపారేస్తున్న ప్రభాస్!

- Advertisement -

బాహుబలి ది బిగినెంగ్ సాధించిన భారీ విజయంతో.. ఈ సినిమా సాధించుకొన్న గొప్ప కలెక్షన్లతో బాహుబలి పార్ట్ 2 మీద హైప్ అమాంతం పెరుగుతోందా? రెండో పార్టుమీద కోట్ల రూపాయలను వెచ్చిచండానికి అనేకమంది మందుకు వస్తున్నారా?

తొలి సగం సృష్టించిన సంచలనం నేపథ్యంలో రెండో పార్టుపై ఎంత పెట్టుబడి పెట్టినా లాభం వస్తుందనే నమ్మకం నిర్మాతల్లో వచ్చిందా? ఈ నేపథ్యంతో ఒక కార్పొరేట్ కంపెనీ బాహుబలి పార్ట్ 2 మీద ఏకంగా 325 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందా ?.. ప్రస్తుతం ఈ విషయాల గురించే చర్చ జరుగుతోంది.

బాహుబలి రెండో పార్టీపై పెట్టుబడి పెట్టడానికి ఒక సంస్థ ముందుకు వచ్చిందని ఆ కార్పొరేట్ సంస్థ ఏకంగా 325 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ సినిమాను రూపొందిచండానికి  సిద్దం అవుతోందని వార్తలు వస్తున్నాయి. అందులో ఏకంగా 65 కోట్ల రూపాయలు ప్రభాస్ రెమ్యూనరేషన్ కిందే జమ చేయనున్నారనేది వార్తల సారాంశం. బహుబలి ది బిగినింగ్ విజయం ఇచ్చిన విశ్వాసమే వారి చేత అన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిస్తోందని అంటున్నారు.

మరి ఇదంతా నిజమేనా? నిజంగానే ప్రభాస్ ఏకంగా 65 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పొందుతున్నాడా?! అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ విషయం గురించి ప్రబాస్ స్పందిస్తూ..అదంతా ఉత్తిదేనని తేల్చేశాడు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు! మరి బాహుబలి గురించి వస్తున్న వార్తల్లో.. వసూళ్లు, బడ్జెట్ ల విషయంలో వినిపిస్తున్న కోట్ల రూపాయల కోతల్లో ఏది నిజమో..ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితే నెలకొంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -