Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రభాస్ డబ్బింగ్ విషయంలో వినిపిస్తున్న సందేహాలు

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా బాలీవుడ్లో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ డబ్బింగ్ విషయంలో కొన్ని సందేహాలు రేకెత్తుతున్నాయి. ‘బాహుబలి’ సినిమా హిందీ వెర్షన్ లో ప్రభాస్ గొంతు ప్రేక్షకులని చాలా బాగా మెప్పించింది. ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్ గొంతు ప్రభాస్ కి చాలా బాగా సెట్ అయింది. ‘సాహో’ సినిమాలో కూడా అతనే డబ్బింగ్ చెబుతారని, అతని వాయిస్ ప్రభాస్ కి చాలా బాగా సెట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో ససేమిరా ఒప్పుకోవడంలేదు.

తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాను అని ప్రభాస్ చెబుతున్నారట. నిజానికి సూర్య, రాజశేఖర్ వంటి హీరోలు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ లను ఒకప్పుడు మార్చారు కానీ ఆ సినిమాలు సరిగ్గా ఆడిన దాఖలాలు లేవు. పైగా ప్రెస్ మీట్ సమయంలో కూడా ప్రభాస్ హిందీ మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డట్టే కనిపించాడు. మరి ఈ నేపథ్యంలో తన గొంతు సినిమాకి ఎంత వరకు సెట్ అవుతుందని అభిమానులు కూడా కొంత భయపడుతున్నారు. ఆఖరికి డిస్ట్రిబ్యూటర్ లు కూడా ప్రభాస్ బదులు ప్రహ్లాద తో డబ్బింగ్ చెప్పించమని చెబుతున్నారట. మరి ఈ విషయంలో దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది. సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -