ప్రభాస్ – అనుష్క… టాలీవుడ్‌లో ఈ జోడి మీద వచ్చినన్ని గాసిప్స్ మరో జంటపై రాలేదు అంటే అతిశేయోక్తికాదు. గతంలో చాలాసార్లు వీరిద్దరి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అటు ప్రభాస్ , ఇటు అనుష్కలిద్దరు అటువంటిది ఏం లేదని తెలిపారు. అయినప్పటికి నిత్యం వీరిద్దరిపై ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తునే ఉంది. తాజాగా వీరిద్దరు మరోసారి మీడియాకు హాట్ టాపిక్‌గా మారారు. దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు పెళ్లి కోసం జైపుర్ వెళ్లాడు ప్రభాస్.
ఈ పెళ్లికి అనుష్క కూడా వెళ్లడంతో ,అక్కడ ఉన్న మీడియా వీరిపై ఫోకస్ పెట్టింది.వీరిద్దరూ కలిసి రాజస్థానీ సంప్రదాయంలో బట్టలు ధరించి డాన్స్ లు కూడా చేశారని వార్తలు వినిపించాయి. ఇక ఆదివారం కార్తికేయ పెళ్లి ఘనంగా జరిగింది. రామ్ చరణ్ భార్య ఉపాసన,ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి,నాని భార్య అంజనా ఇలా భార్య,భార్తలు నూతన జంటను ఆశీర్వదించగా ,ప్రభాస్ ,అనుష్కలు మాత్రం పెళ్లి కాకుండానే ఇద్దరు కలిసి కొత్త జంటను ఆశీర్వదించారు. అనుష్క వెనకాలే ప్రభాస్ ఉన్న ఫోటోలు సోషల్ మీడయాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో వీరిద్దరు అందంగా కనిపిస్తున్నారని ,పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్‌పై ప్రభాస్, అనుష్కలు ఎలా స్పందిస్తారో చూడాలి.
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
- ‘ధురంధర్’పై పవర్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!
