Friday, May 10, 2024
- Advertisement -

బాలీవుడ్ కు కొత్త పేరుతో పరిచయం కానున్న ప్రభాస్?!

- Advertisement -

ఇంతకు ముందు హీరో నితిన్ ఒక బాలీవుడ్ సినిమాలో నటించాడు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘అగ్యాత్’ సినిమాతో అతడు బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో టైటిల్ కార్డ్స్ లో నితిన్ పేరు “నితిన్ రెడ్డి” అని పడుతుంది. తెలుగులో అయితే నితిన్ తన పూర్తి పేరును ఉపయోగించుకోలేదు కానీ..

బాలీవుడ్ లో మాత్రం ఆ పని చేశాడు. మరి తెలుగుకు, హిందీకి ఆ మాత్ర తేడా ఉండాలని.. నితిన్ ఆ పని చేస్తే చేసి ఉండొచ్చు.

మరి ఇప్పడు ప్రభాస్ కూడా అదే పని చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ హీరో తాజా సినిమా ‘బాహుబలి’ హిందీలో విడుదల కాబోతుండటం తెలిసిందే. హిందీలో ఈ సినిమాను కరణ్ జొహార్ విడుదల చేయనున్న విషయం కూడా తెలిసిందే. మరి ఇప్పడు విశేషం ఏమిటంటే.. హిందీలో ప్రభాస్ పేరును కాస్తంత మార్చనున్నారట. అంటే నితిన్ లాగే పూర్తి పేరుతో బరిలోకి దిగనున్నాడట. ప్రభాస్.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అయితే హిందీ వెర్షన్ లో ప్రభాస్ పేరు “ప్రభాస్ రాజు’ లేదా “ప్రబాస్ వర్మ” అని కానీ పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇలాంటి పూర్తి పేరుతో బాలీవుడ్ ఆడియన్స్ కు కొంత డిఫరెంట్ పరిచయం కానున్నాడట ప్రభాస్. అదీ కథ. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -