Thursday, May 2, 2024
- Advertisement -

చరణ్ ఓకే, రాఘవేంద్రరావును నమ్ముకొని అంత పెట్టలేమంటున్నారు!

- Advertisement -

ఇటీవలే “జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా 25 సంవత్సరాలను పూర్తి చేసుకొంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఇండస్ట్రీ చరిత్రలో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ గా ఉన్న ఈ సినిమా కు పాతికేళ్ల సంబరాలను దర్శక, నిర్మాతలు చాలా గ్రాండ్ గా జరుపుకొన్నారు.

ఈకార్యక్రమానికి చిరంజీవి, శ్రీదేవితో సహా దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మాత అశ్వినీదత్ తదితరులంతా హాజరయ్యారు.

మరి ఈ సందర్భంగా ఈ సినిమాకు సీక్వెల్ లేదా.. రీమేక్ అనే అంశం చర్చకు వచ్చింది. దీని పట్ల అశ్వినీదత్ ఉత్సాహంతో నే ఉన్నాడట. రామ్ చరణ్ ను హీరోగా పెట్టి రూపొందించాలనే ఆలోచన ఉండనే ఉంది. అయితే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తో సినిమా తీయాలంటే కనీసం 60 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. అశ్వినీదత్ ప్రస్తుతానికి అంత పెట్టే స్థితిలో లేరు. మరి ఈ సినిమాకు దర్శకుడు మాత్రం రాఘవేంద్ర రావేనట!

ఇదే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కపోవడానికి కారణం అని తెలుస్తోంది. రీమేక్ చేసినా దానికి రాఘవేంద్రరావే దర్శకుడిగా ఉండాలంటే.. పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. ఇప్పట్లో రాఘవేంద్ర రావు సినిమాకు 60 కోట్ల రూపాయల మార్కెట్ అయ్యే పరిస్థితి లేదని ఇండస్ట్రీ అభిప్రాయం. దీంతోనే ‘జగదేక వీరుడు, అతిలోక సుందరి’ సినిమా నయా వెర్షన్ పట్టాలెక్కడం లేదని టాక్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -