Saturday, April 27, 2024
- Advertisement -

దీనికి కూడా ప్రభాస్ ముందు పడాలట..దాన్ని చూసి..?

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ మొదలుపెడితే కానీ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు మొదలు కాలేదు, ప్రభాస్ మొదలు పెడితే కానీ టాలీవుడ్ లో 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు మొదలు కాలేదు.. ప్రభాస్ మొదలు పెడితే కానీ స్టార్ హీరో ల మల్టి స్టారర్ సినిమాలు మొదలు కాలేదు.. ప్రభాస్ మొదలు పెడితే కానీ ఇండియా లో టాప్ గ్రాసర్ సినిమాలు టాలీవుడ్ నుంచి రాలేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా చాలా వరకు ఇండస్ట్రీ ని షేక్ చేసే రికార్డులే సృష్టించింది..  కలెక్షన్ల దగ్గరినుంచి రిలీజ్ అయ్యే స్టైల్ వరకు బాహుబలి అన్నింటా కొత్తదారులు టాలీవుడ్ కి చూపించింది అని చెప్పాలి..

ప్రభాస్ ఆ తర్వాతే అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.. బాలీవుడ్ జనాలు కూడా ప్రభాస్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారంటే బాహుబలి తో ప్రభాస్ వారికి కూడా ఎంతగా ఎక్కేశాడా అర్థం చేసుకోవచ్చు.. ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ ఫారెన్ లో జరుగుతుంది.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా కదల్లేదు.. దాంతో ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ ఐయ్యింది. అయితే ప్రభుత్వం సడలింపులు నేపథ్యంలో తిరిగి షూటింగ్ లు ప్రారంభించారు.. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ విదేశాల్లో ఉండడంతో ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని క్వారంటైన్ లో ఉండి షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టనున్నారు..

అలా విదేశాలలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు అన్నిటికీ ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ మార్గదర్శిగా మారింది. ఈ చిత్రం బృందం ఇప్పటికే ఇటలీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ముందుగా పద్నాలుగు రోజుల క్వారంటైన్ లో వుండి, అనంతరం షూటింగ్ మొదలు పెడతారు. అక్కడ షూటింగ్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులుంటాయా, దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి వగైరా అన్నీ రాధే శ్యామ్ బృందం నుంచి తెలుసుకుని వచ్చే నెలలో అక్కడకు వెళ్లాలని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇంత ప్లాన్ చేస్తున్నాడా….?

RRR విషయంలో గట్టిగా ఉన్న రాజమౌళి..?

పుష్ప విలన్ ని మళ్ళీ మార్చేసిన దర్శకుడు…!

విజయ్ ఫ్యామిలీ పార్టీలో రష్మీక.. లవ్ కాబాట్టే పిలిచాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -