Sunday, April 28, 2024
- Advertisement -

ప్రభాస్ – మూరుతి మూవీ అప్‌డేట్

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా కూడా చేస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ఖరారు కాకపోయిన రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. షూటింగ్ సమయంలో ఫోటోలు కూడా లీక్ కాగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు కీలకపాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని యోగిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ , మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -