Monday, April 29, 2024
- Advertisement -

చిక్కుల్లో నాగబాబు..ఏపీలో కష్టమే!

- Advertisement -

ఏపీలో దొంగ ఓట్ల తొలగింపు వివాదం వైసీపీ – టీడీపీ మధ్య విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల నేతలు ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేయగా ప్రధానంగా వైసీపీ నేతలు తెలంగాణ, ఏపీలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ఈసీ సైతం రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారు ఒకచోట వదులుకోవాలని సూచించారు.

అయితే ఇప్పుడు ఇదే మెగాబ్రదర్ నాగబాబు మెడకు చుట్టుకుంది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న నాగబాబు కుటుంబం పీలో కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఏంటని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు వైసీపీ నేతలు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు, ఆయన భార్య, కుమారుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌-168లో కొణిదెల నాగబాబు (సీరియల్‌ నెంబర్‌-323), కొణిదల పద్మజ(సీరియల్‌నెంబర్‌- 324), సాయి వరుణ్‌ తేజ్‌(సీరియల్‌ నెంబర్‌-325) ఓటు వేశారు. ఇక త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా నాగబాబు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో పవన్‌తో పాటు నాగబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ కొణిదెల నాగబాబు చేసిన ఘనకార్యం. ఏం ప్యాకేజ్, మ్యారేజ్ స్టార్? నీతులు పక్కన వాళ్లకు చెప్పడమేనా తమరు పాటించరా అంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. మరి ఈ వివాదంపై మెగా బ్రదర్ ఏ విధంగా స్పందిస్తరో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -