Sunday, April 28, 2024
- Advertisement -

మారుతి – ప్రభాస్ సర్‌ప్రైజ్ రెడీ!

- Advertisement -

టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ దర్శకుడు మారుతి. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న మారుతి..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు జోష్ నింపేందుకు ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా చూడని ప్రభాస్‌ని ఒక కొత్త లుక్ లో చూపించబోతున్నారు దర్శకుడు మారుతి. డైనోసార్ డార్లింగ్ గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి అంటూ కథపై ఇప్పటికే హింట్ ఇచ్చేశారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌, హారర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కించనున్నారట మారుతి. ఈ సినిమాలో సంజయ్ దత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తండ్రి పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారట. కల్కి 2898 ఏడి మే9న రిలీజ్ కానుండగా దీని తర్వాత మారుతి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సలార్ 2,సందీప్ వంగా, హను రాఘవపూడి సినిమాలు లైన్‌లో పెట్టారు ప్రభాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -