Monday, May 6, 2024
- Advertisement -

కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవే?

- Advertisement -

దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి రాగా ఏపీలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలను పార్టీలో చేర్చుకోగా ఆమెను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిలకు కీలక పదవి కట్టబెట్టడాన్ని కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్..మెగాస్టార్ పేరును తెరపైకి తెచ్చారు. త్వరలోనే చిరంజీవిని కలిసి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతానని,చిరుయే మా సీఎం అభ్యర్థి అని తేల్చిచెప్పారు.

గతంలోనూ చిరంజీవికి సపోర్టుగా వ్యాఖ్యలు చేశారు చింతా మోహన్‌. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా చిరంజీవి సీఎం అయితే బాగుండేదని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తిరుపతి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు చిరు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పగా తాజాగా చింతా మోహన్ చేసిన కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -