Sunday, May 12, 2024
- Advertisement -

ప్రభాస్ సినిమా లోకి రావడం వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదట

- Advertisement -

ప్రభాస్ ప్యాన్ ఇండియన్ సినిమాలతో తన మార్కెట్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. కానీ పెళ్లి గురించి మాత్రం పెద్దగా ఆలోచించడం లేదు. ఈ విషయం కొందరు అభిమానులు మాత్రమే కాక తన కుటుంబ సభ్యులను కూడా కలవరపెడుతోంది. ప్రభాస్ పెళ్లి విషయమై ప్రభాస్ అమ్మగారు కూడా అంతే అలానే ఎదురుచూస్తున్నారు. అసలు ప్రభాస్ సినిమాల్లోకి రావడం కూడా వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలిపాడు. ప్రస్తుతం ‘సాహో’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ తనకి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తే వాళ్ళ అమ్మగారికి అస్సలు నచ్చదని చెప్పాడు. అసలు ప్రభాస్ సినిమాల్లోకి వెళ్లడం కూడా ఆమెకు ఇష్టం లేదని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇప్పుడు ప్రభాస్ సంపాదించిన పేరు ప్రఖ్యాతలు చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా ప్రభాస్ విషయంలో గర్వపడుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -