Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవబోతున్న ఇంటర్నెట్ సెలబ్రిటీ

- Advertisement -

ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మొదలై నాలుగు వారాలు పూర్తి అయిపోయింది. మొదటి వారం హేమ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోగా, రెండవ వారం జాఫర్, మూడవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వారాంతం వచ్చేసింది. ప్రస్తుతం నామినేషన్స్ లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం, హిమజ, అషు రెడ్డి, బాబా భాస్కర్, మహేష్ విట్ట, మరియు శివ జ్యోతి లు ఉన్నారు. ఇవాళ ఇద్దరు లేదా ముగ్గురు ని నాగార్జున సేఫ్ జోన్ లోకి పంపనున్నారు. మిగతా వారిలో రేపు ఒక కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్ళిపోబోతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ వారం అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్ సెలబ్రిటీగా బిగ్ బాస్ షో లో చోటు సంపాదించిన అషు రెడ్డి కి నామినేషన్ సమయంలో ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ కి గుడ్ బై చెప్పాల్సిన సమయం రానే వచ్చింది. ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కాబోతోంది. మరోవైపు బిగ్బాస్ సీజన్ 3 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా శ్రద్ధాదాస్, ఈషా రెబ్బా వంటి పేర్లు వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు బోలెడు వివాదాలు, గొడవలతో బిగ్ బాస్ ఆసక్తికరంగా నడుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -