Thursday, May 2, 2024
- Advertisement -

గణతంత్ర సంబరాల వేళ భారతీయులు దేశభక్తితో ఉప్పొంగుతోంటే… బాబు జెండాను ఎంతలా అవమానించాడో తెలుసా?

- Advertisement -

భారతదేశంలోనే అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు. ప్రపంచానికి పాఠాలు చెప్పానని కూడా డప్పాలు కొట్టుకుంటూ ఉంటాడు. కానీ చేతల్లో మాత్రం అందులో పదో వంతు శాతం కూడా చూపించలేడు. ఇక దేశభక్తి గురించి కూడా చంద్రబాబు ఘనంగా ఎన్నో సార్లు చెప్పుకున్నాడు. ఆ మధ్య ఓసారి జెండా వందనం కార్యక్రమం సందర్భంగా జాతీయగీతం ఆలపించడంలో అప్పటి వైకాపా నేత జూపూడి ప్రభాకరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ తప్పును జగన్‌కి ఆపాదించిన ఘనత పచ్చ బ్యాచ్‌ది. కనీసం జాతీయ గీతం కూడా పాడడం రాని అదే జూపూడి ప్రభాకరరావు ఇప్పుడు టిడిపిలో లీడర్. చంద్రబాబుతో కలిసి జగన్‌పై విమర్శలు చేస్తూ ఉంటాడు. అక్కడ జాతీయగీతాన్ని అవమానించినందుకు నిజంగానే పచ్చ బ్యాచ్ అంతలా ఫీలయి ఉంటే ….ఆ అవమానానికి కారణమైన అదే జూపూడి ప్రభాకరరావును టిడిపిలో ఎందుకు చేర్చుకున్నట్టు? ఇక్కడ పచ్చ బ్యాచ్ ప్రేమ అంతా కూడా జాతీయ గీతంపై కాదు జగన్‌ని జనం దృష్టిలో విలన్‌గా చిత్రీకరిచండంపైనే.

అప్పట్లో తీవ్ర హంగామా చేసిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఏకంగా జాతీయ జెండాను అవమానిస్తే …….అది కూడా ఉద్ధేశ్యపూర్వకంగా అవమానిస్తే అస్సలు మాట్లాడడం లేదు ఎందుకో? ఇలాంటి దేశభక్తికి సంబంధించిన విషయాల్లో కూడా బాబు చేస్తే సంసారం అన్న నీతినే ఫాలో అవుతారా? విషయానికి వస్తే ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు చంద్రబాబు హాజరు కాలేదు. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు గాక……కానీ గణతంత్ర దినోత్సవం అప్పటికప్పుడు వచ్చే కార్యక్రమం కాదుగా…..ఆ మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? గణతంత్ర దినోత్సవాలకు ఇతర ముఖ్యమంత్రులు ఎవరైనా ఎప్పుడైనా గైర్హాజరయ్యారా?

ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత సివిల్ సర్వెంట్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ జెండాను తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో భాగంగా జాతీయజెండాను ఆవిష్కరించే కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే ఆ జెండా తాడును చంద్రబాబు రెండు మూడుసార్లు లాగినప్పటికీ జెండా ఆవిష్కరణ జరగలేదు. దాంతో అసహనానికి గురైన చంద్రబాబు ఆ వెంటనే అందరినీ షాక్‌కి గురిచేస్తూ పక్కకు వెళ్ళిపోయి క్రికెట్ టోర్నమెంట్ జెండాలను ఎగరేసి జాతీయగీతాలాపన ప్రోగ్రాంకి వెళ్ళిపోయారు. అసలు జాతీయ జెండా ఆవిష్కరించకుండా జాతీయగీతాలపన చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జెండా ఆవిష్కరణ కార్యక్రమం కోసం రెండు నిమిషాలు కూడా కేటాయించకుండా……జాతీయ జెండాను ఆవిష్కరించకుండా వెళ్ళడం తీవ్రస్థాయిలో అవమానించడమేనని సోషల్ మీడియాలోనూ, టివీ చర్చల్లోనూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు లాంటి అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే నాయకుడికి ఈ స్థాయి నిర్లక్ష్యం మాత్రం కచ్చితంగా భావ్యం కాదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జాతీయ జెండాను అవమానిస్తూ ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నట్టు? మాట్లాడితే దేశభక్తి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు…….ప్రజలకు ఇచ్చిన హామీల్లాగే జాతీయ జెండా విషయంలో, దేశభక్తి విషయంలో కూడా మాటలు ఒకలా….చేతలు మరోలా ఉంటే ఎలా?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -