Tuesday, May 7, 2024
- Advertisement -

ప్ర‌భాస్ ‘ సాహో’ మేకింగ్ వీడియో..!

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ న‌టిస్తున్న సాహో సినిమా మేకింగ్ వీడియోను ఆయ‌న పుట్టిన రోజున సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.ఇప్ప‌టికే ‘షేడ్స్ ఆఫ్ సాహో’ అంటూ సాహో సినిమాలోని ప్ర‌భాస్ లుక్‌ని విడుద‌ల చేశారు. అదే పేరిట అదిరిపోయే వీడియోనూ విడుదల చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీలో నిర్మితమవుతున్న చిత్రంలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని ఈ వీడియో చూపిస్తోంది. హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దించిమరీ షూట్ చేసిన ఫైట్ సీన్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలను, మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

అబుదాబిలో జరిగిన చిత్ర షూటింగ్, కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వీడియోకు థమన్ సంగీతం అందించాడు. ‘సాహో’ కు మాత్రం శంకర్ ఈశన్ లాయ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. నిమిషాల వ్యవధిలో లక్షల వ్యూస్ సాధించి, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి.సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తుంది.ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కితున్న ఈ సినిమాను వ‌చ్చే ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -