Sunday, April 28, 2024
- Advertisement -

సలార్…ట్రిపుల్ సెంచరీ చేరువలో!

- Advertisement -

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో దాదాపు రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.

మొదటిరోజు ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 71 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ 104 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.143.27 కోట్లు రాబట్టగా రెండు రోజుల్లో 295.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

వీకెండ్ కావడం, వరుస సెలవులు రావడంతో సలార్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా సలార్‌తో ప్రభాస్ హిట్‌ని అందుకోగా మేకర్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -