Monday, May 20, 2024
- Advertisement -

టీడీపీ లెక్కకు తిక్కుందా?

- Advertisement -

ఏపీలో అధికారంలోకి రావడం ఇదే టీడీపీ ముందున్న ఆప్షన్‌. దాని కోసం ఎన్ని అబద్దాలనైనా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే పరిమాధి. కానీ అందుకోసం ఎన్నైనా అడ్డదారులు తొక్కవచ్చా అన్నదే ప్రశ్న. రాజకీయాల్లో కనీస విలువలు పాటించాలి అంటారు కానీ అలాంటిదేమీ అవసరం లేదంటోంది టీడీపీ. గోబెల్స ప్రచారం చేస్తూ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది టీడీపీ

ఇందులో భాగంగా రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిషోర్‌ని ఆశ్రయించింది టీడీపీ. అయితే అధికారంలోకి రావడానికి ప్రజల్లో కనీస బలం ఉంటే ప్రజలు ఆదరించే ఛాన్స్ ఉంటుంది. కానీ అసలు టీడీపీపై ప్రజల్లో నమ్మకమే లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ లబ్ది పొందేందుకు చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఎందుకంటే ఏ సామాజికవర్గాన్ని లెక్కలో తీసుకున్నా, నిరుద్యోగులు,గృహిణులు,వృద్దులు ఇలా అన్ని వర్గాల ప్రజల్లో జగన్ సర్కార్‌పై పాజిటివ్‌ తప్పా ఎక్కడా నెగటివ్ కనిపించడం లేదు. కానీ ఏదో జరిగిపోయినట్లు పదేపదే ప్రచారం చేసి లబ్ది పొందాలని టీడీపీ భావిస్తోంది. ఇది ఖచ్చితంగా టీడీపీకే ఎఫెక్ట అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెలుగు దేశం నేతలే ఆ పార్టీలో చేరితే అదేదో గొప్ప అన్నట్లు ప్రచారం చేస్తున్నాఉ. ఇక పచ్చమీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. వైసీపీ షాక్..పార్టీని వీడుతున్న నేతలు అంటూ ప్రచారం చేస్తూ ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేస్తుండగా కొంతమంది మాత్రం టీడీపీ లెక్కకు తిక్కుందా అని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -