Sunday, April 28, 2024
- Advertisement -

సీఎం జగన్‌పై ఉన్మాద పోస్టులా?

- Advertisement -

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎన్‌ఆర్‌ఐ యష్ బొద్దులూరిని అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. దీనిని ఖండించిన టీడీపీ నేతలు ఏపీ సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు అవాకులు, ఛవాకులు పేల్చారు. జగన్‌పై స్ధాయికి మించి ఉన్మాద పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీనికి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

టీడీపీ అంటే కర్రీ పాయింట్ల పార్టీ అనిపించిందని సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు ఖండించారు. చారని విమర్శించింది. అట్టు అట్టున్నర.. దోసె.. దోసెన్నర.. ఆ సంగతి తర్వాత గానీ యశ్‌ బుర్ర మోకాల్లోనే ఉన్నట్టుందని ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా వెల్లడించింది. మీ విషయంలో, మీ కుటుంబసభ్యుల విషయంలో ఇలాగే పోస్టులు పెడితే అభినందిస్తూ దండలు వేస్తారా? అరదండలు వేస్తారా? చెప్పండని ప్రశ్నించింది వైసీపీ.

యష్‌ లాంటి ఉన్మాదిని సమర్థిస్తున్నారంటే.. ఇలాంటి మానసిక ఉగ్రవాదులను టీడీపీ .. డబ్బులిచ్చి పెంచి పోషిస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది. యశ్‌ మీద పెట్టిన కేసులు మాత్రమే చూస్తున్నారని.. జగన్‌ను టార్గెట్‌ చేస్తూ పెట్టిన చూడలేదా? చూడలేరా? అని ప్రశ్నించింది. జగన్‌ ప్రభుత్వంపై యశ్‌ చేసిన పోస్టులను కూడా ట్యాగ్‌ చేసింది. ఫారిన్ వెళ్లడం కాదు.. నాగరికత, సభ్యత సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే చట్టం చూస్తూ ఊరుకోదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వైసీపీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -