Tuesday, May 7, 2024
- Advertisement -

ప్రభాస్ మొదలెట్టేశాడు!

- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది నింజగా కిక్ ఇచ్చే న్యూస్. ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంత కాదు. ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌ చేశారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుందని మేకర్స్ వెల్లడించారు. దీంతో దేశంలోనే కాదు విదేశాల్లోనూ సలార్ మేనియాతో ఫ్యాన్స్‌ ఉగిపోతున్నారు. అంతేగాదు యుఎస్‌లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అడ్వాన్స్ బుకింగ్స్ వాపస్ ఇవ్వడం మొదలు పెట్టడంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పకనే చెప్పారు. సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణం గా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ షురూ అయినట్లు తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషలలో స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ ఈ డబ్బింగ్ వర్క్ ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. మేకర్స్ ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -