Monday, May 6, 2024
- Advertisement -

కోమటిరెడ్డి అలకపాన్పు..టీ కప్పులో తుపానేనా?

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకపాన్పు ఎక్కారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. తొలి లీస్ట్ పై రేపో మాపో ప్రకటన రానుండగా సీనియర్ నేతైనా కోమటిరెడ్డి మాత్రం పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. కీలక కమిటీలో తనకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే గాంధీ భవన్‌ గడప తొక్కేందుకు ఇష్టపడటం లేదు కోమటిరెడ్డి. అయితే ఆయన్ని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీకి మాణిక్‌రావ్ ఠాక్రేకు అప్పగించగా కోమటిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు కేసీ వేణుగోపాల్. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని బుజ్జగించనున్నారు ఠాక్రే. దాదాపు 17 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వేదికగా సీడ్యబ్లూసీ సమావేశం జరగనుండగా కోమటిరెడ్డి అలకపాన్పు ఎక్కడం కొంత ఇబ్బందికర పరిణామామే.

అయితే కోమటిరెడ్డి అలకపాన్పు ఎక్కడం ఇదే తొలిసారి కాదు చివరిసారి కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి కోమటిరెడ్డిపై పార్టీలో ఓ అపవాదు సైతం ఉంది. పార్టీ గట్టెక్కుతుంది అన్న ప్రతిసారి ఇదే విధంగా చేస్తారని గుర్తు చేస్తున్నారు నాయకులు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో ఉన్న తన తమ్ముడికి మద్దతుగా ప్రచారం చేయడం ఇందుకు సంబంధించిన ఆడియో లీక్ కావడం వైరల్‌గా కూడా మారింది. ఇక పలు సందర్భాల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇదంతా గుర్తుచేస్తూ కొంతమంది రాష్ట్రనేతలు కోమటిరెడ్డిని లైట్ తీసుకోగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ నాయకుడిని వదులుకునే స్థితిలో లేదు. అందుకే స్వయంగా ఠాక్రేను రంగంలోకి దించింది. ఠాక్రే – కోమటిరెడ్డి భేటీ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా ఇదంతా టీ కప్పులో తపానేనని కొంతమంది నాయకులు కొట్టిపారేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -