Friday, May 3, 2024
- Advertisement -

మెగా హీరోతో ‘బాహుబలి’ సినిమా..

- Advertisement -

మెగా హీరోతో సినిమా చేయడానికి బాహుబలి సిద్దమైపోయాడు.దీనికోసం తమ ఫ్రెండ్స్ బ్యానర్ గా చెప్పే తన బ్యానర్ అయినటువంటి యువి క్రియేషన్స్ లో ప్రభాస్ ఓ సినిమాను రూపొందించ బోతున్నాడు.

దీనికి జిల్ లాంటి సాలిడ్ సినిమాను రూపొందించిన రాధాకృష్ణ డైరెక్షన్ చేయబోతున్నాడు.జిల్ అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ టేకింగ్ పరంగా హై స్టాండర్డ్స్ మెయిన్ టైన్ చేసినందుకు గాను రాధాకృష్ణకు ప్రశంసలు దక్కాయి.చెర్రీ కూడా ప్రభాస్ తో క్లోజ్ నెస్ కారణంగాను అదే విధంగా యువి క్రియేషన్స్ పార్టనర్స్ లో ఒకరైన వంశీ మీద అభిమానంతోను ఈ సినిమాకు ఒపుకున్నట్లు తెలుస్తోంది.

తని ఒరువన్ తర్వాత ఈ చిత్రం ఉండొచ్చని చెబుతున్నారు. ఒక వేల త్రివిక్రమ్ అఖిల్ చిత్రానికి కమిటైపోతే ఖచ్చితంగా చెర్రీ ముందుగా ఈసినిమానే ఓకే చెప్పి….సెట్స్ మీదకు తీసుకు వెల్లొచ్చంటున్నారు.

ఏది ఏమైనా ఇగోలకు పోకుండా ఒకరితో ఒకరు ఇలా కలిసిపోయి హీరోలు ఇలా సినిమాలు చేసుకోవడం ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తుంది. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -