Saturday, May 18, 2024
- Advertisement -

తన ఫేవరేట్ క్రికెటర్ ని కలిసిన పవన్ కళ్యాణ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే , ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవర్ స్టారుడు. ప్రస్తుతం గుజరాత్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. బాబీ దర్సకత్వంలో తెరకి ఎక్కుతున్న ఈ సినిమా మరొక నెల పాటు గుజరాత్ లోనే ఉంటుంది.

పవన్ టీం  బస చేస్తున్న హోటల్ లోనే లెజెండ్రీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఉండడం కళ్యాణ్ – కపిల్ కలవడం ఇప్పుడు కొత్త విశేషంగా మారింది. ఇండియన్ క్రికెట్ కి కొత్త పుంతలు తొక్కించిన కపిల్ అంటే చిన్నతనం నుంచీ పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట. అనుకోకుండా అదే హోటల్ లో ఆయన్ని కలవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కళ్యాణ్.

ఆయనతో కలిసినపుడు పవన్ చాలా ఉద్వేగానికి గురయ్యాడు అని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తన చిన్న తనం లో క్రికెట్ మీద ఉన్న ఇష్టం , కపిల్ మీద ఉన్న ఇష్టం కపిల్ కి చెప్పినట్టు తెలుస్తోంది. కపిల్ కూడా పవన్ కళ్యాణ్ నటించిన పలు సినిమాలు చూసాను అని కపిల్ చెప్పారట. పవన్‌తో సరదాగా ముచ్చటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సర్దార్ టీమ్ పలు ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం విడుదల చేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -