Saturday, May 4, 2024
- Advertisement -

రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్.. 

- Advertisement -

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. వరుస సిక్సర్లతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా అనే రీతిలో రోహిత్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ డబుల్ సెంచరీ కొట్టాడు. 153 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సహాయంతో ద్విశతకం (208) సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రోహిత్ అవతరించాడు.

మరోవైపు టీమిండియా బ్యాటింగ్ ముగింసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. రోహిత్ 208 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ధావన్ 68, అయ్యర్ 88, ధోనీ 7, పాండ్యా 8 పరుగులు చేశాడు. చివరి బంతికి పాండ్యా ఔట్ అయ్యాడు. లంక బౌలర్లలో ఫెర్నాండో 3, పతిరన ఒక్క వికెట్ తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -