Monday, April 29, 2024
- Advertisement -

క‌మెడియ‌న్‌ని కొట్టిన ప్ర‌కాష్ రాజ్‌

- Advertisement -

సీనియ‌ర్ న‌టుడు ప్రకాష్ రాజ్ త‌రుచు వివాదాల‌తో సావాసం చేస్తుంటారు.తాజాగా ఆయన మ‌రో వివాదంలో చిక్కుకున్నారు.ఓ సినిమా షూటింగ్ సెట్‌లో క‌మెడియ‌న్‌పై చేయి చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.దిల్ రాజు నిర్మిస్తోన్న ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రకాష్ రాజ్ తో కలిసి నటిస్తోన్న కమెడియన్ సప్తగిరిపై ఆయన చేయి చేసుకున్నట్లుగా వార్తలు బయటకి వచ్చాయి.గ‌తంలో కూడా ప్రకాష్ రాజ్ ఇలాగే చేశాడ‌ని చాలా ఫిర్యాదులు అందాయి.

వాటిపై వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు ప్రకాష్ రాజ్‌.హీరోయిన్ అనుప‌మ ప‌రేమేశ్వ‌ర‌న్ కూడా ప్రకాష్ రాజ్ ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు వార్తలు అప్ప‌ట్లో వ‌చ్చాయి. దర్శకుడు త్రినాధరావు నక్కిన పై కూడా ప్రకాష్ రాజ్ కోప్పడిన మాట నిజమేనని ఓ మీడియా ప్రతినిధితో వెల్లడించారు. అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని నిర్మాత దిల్ రాజు కవర్ చేస్తున్నాడు.ఇందులో నిజం లేదంటే ఇప్పటికే సప్తగిరి బయటకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చేవాడని చాలమంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -