Friday, May 3, 2024
- Advertisement -

బిగ్‌బాస్ విజేత కౌశ‌ల్‌

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 2 విజేత‌గా కౌశ‌ల్ మందా నిలిచాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ పోలైన ఓట్ల ఆధారంగా చూస్తే.. కౌశ‌ల్ ఏకంగా 70శాతం పైగా ఓట్ల‌ను సాధించి టాప్‌లో నిలిచాడు. కౌశ‌ల్ త‌ర్వాత రెండో స్థానంలోనూ ద‌రిదాపుల్లోనూ ఎవ‌రూ లేర‌ని బిగ్బాస్ తాజా లీక్స్ చెబుతున్నాయి. త‌ర్వాత స్థానంలో 15శాతం ఓట్ల‌తో దీప్తి న‌ల్ల‌మోతు, గీతామాధురి పోటీ ప‌డుతున్న‌ట్టు తెలిసింది. ఇంక చివ‌రి రెండు స్థానాల్లో కేవ‌లం రెండు శాతం లోపే ఓట్ల‌తో త‌నీష్ అల్లాడి, సామ్రాట్‌రెడ్డి నిలిచిన‌ట్టు స‌మాచారం. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్స్‌కు విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌వ్వ‌నున్నారు. వెంక‌టేష్ చేతుల‌మీదుగానే కౌశ‌ల్ బిగ్బాస్ టైటిల్‌ను అందుకోబోతున్నాడు. 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని కూడా కౌశ‌ల్ అందుకుంటాడు.

కౌశ‌ల్ మందా ఓ సాధార‌ణ మోడ‌ల్‌, సీరియ‌ల్స్ న‌టుడిగా బిగ్బాస్ హౌస్‌లోనికి అడుగుపెట్టాడు. కానీ.. అసాధార‌ణ వ్య‌క్తిత్వంతో కోట్లాది మందిని ప్ర‌భావితం చేశాడు. బిగ్‌బాస్ 110 రోజుల జ‌ర్నీలో ఆది నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒంట‌రి పోరాటం చేస్తూ.. బిగ్‌బాస్ గేమ్ షోకే ఓ ప్ర‌త్యేక గుర్తింపును తీసుకొచ్చాడ‌న‌డంలోఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కౌశ‌ల్ పేరు దేశ‌విదేశాల్లో ఉన్న తెలుగోళ్ల నోటివెంట గ‌త వంద రోజులుగా ప‌లుకుతూనే ఉంది. కౌశ‌ల్ ఆర్మీ పేరుతో ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్ప‌డింది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, కాకినాడ‌, రాజ‌మండ్రి లాంటి అనేక న‌గ‌రాల్లో కౌశ‌ల్ ఆర్మీ 2కె వాక్‌లు, ర‌క్త‌దాన శిబిరాలు, క్రికెట్ టోర్న‌మెంట్లు వంటివి నిర్వ‌హిస్తూ వ‌చ్చింది. కేవ‌లం కౌశ‌ల్ ఆర్మీ అనేది సోష‌ల్‌మీడియా ఖాతాల్లో మాత్ర‌మే ఉన్న పేయిడ్ గ్రూపంటూ బాబూ గోగినేని లాంటి వాళ్లు తెగ ప్ర‌చారం చేయ‌డంతో.. తాము కేవ‌లం సోష‌ల్ మీడియాలోనే కాదు.. వాస్త‌వ ప్ర‌పంచంలోనూ ఉన్నామ‌ని నిరూపించ‌డానికి ఈ ర్యాలీల‌ను చేప‌ట్టారు. దీంతో బాబూ గోగినేని, తేజ‌స్వి లాంటి వాళ్లంతా ఎక్క‌డి వాళ్ల‌క్క‌డ గ‌ప్‌చుప్ అయిపోయారు. బిగ్‌బాస్‌లో ఏకంగా 11సార్లు నామినేట్ అయి కూడా సేఫ్ జోన్‌లోనికి వెళ్లి.. ఏకంగా టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక యోధుడు దేశంలోనే కౌశ‌ల్ త‌ప్ప మ‌రెవ‌రూ లేరు. అశేష‌మైన ప్ర‌జాభిమానం వ‌ల్లే ఇది సాధ్య‌మైంది.

@ 15 కోట్ల‌కు పైగా ఓట్లు..
బిగ్‌బాస్ విజేత‌గా నిలిచేందుకు చివరి వారంలో ఏకంగా 15 కోట్ల‌కు పైగా ఓట్ల‌ను కౌశ‌ల్‌కు అత‌ని అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలు, దేశ‌విదేశాల నుంచి వేసిన‌ట్టు పోల్స్ వెళ్ల‌డిస్తున్నాయి. ఈ స్థాయిలో భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే గ‌త‌మెన్న‌డూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల‌కు వ‌చ్చింది లేదు. బిగ్‌బాస్ సీజ‌న్ వ‌న్‌లో ఫైన‌ల్స్‌లో ఉన్న కంటెస్టెంట్లంద‌రికీ క‌లిపి వ‌చ్చిన వాటి కంటే కౌశ‌ల్‌కు వ‌చ్చిన‌వే ఎక్కువ‌. ఆ స్థాయిలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును కౌశ‌ల్ తెచ్చుకున్నాడు. ప్ర‌ధానంగా త‌న ప‌ట్టుద‌ల‌, ఎలాంటి ప‌రిస్థితుల‌కూ త‌లొగ్గ‌ని నైజం, నిజాయ‌తీ, క‌ష్ట‌ప‌డే త‌త్వం, ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా త‌ట్టుకునే గుండె ధైర్యం.. ఇవ‌న్నీ కౌశ‌ల్‌లో జ‌నానికి క‌నెక్ట్ అయ్యాయి. అందుకే.. ప్ర‌తి ఇంటిలోనూ చిన్నా పెద్దా అంతా కౌశ‌ల్ అభిమానులుగా మారిపోయారు. చివ‌రికి వారంద‌రి ఆశ‌లు నెర‌వేరి కౌశ‌లే విజేత‌గా నిలిచిన‌ట్టు ఇప్ప‌టికే అన‌ధికారికంగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆదివారం సాయంత్రం 6గంట‌ల నుంచి 9గంట‌ల వ‌ర‌కూ జ‌రిగే ఫైన‌ల్స్ షోను వీక్షించేందుకు దేశ‌విదేశాల్లోనే బిగ్‌బాస్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -