Sunday, May 19, 2024
- Advertisement -

సాంగ్స్ పాడాలంటే.. అడిగింది ఇవ్వాలన్నాడు : సింగర్ ప్రణవి

- Advertisement -

తన అద్భుతమైన గొంతు తో ఎన్నో పాటలు పాటింది గాయని ప్రణవి. ఆమె పాడిన పాటలు చాలా బాగుంటాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆమె డ్యాన్స్ మాస్టర్ రఘును పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా తానకు ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను గురించి కూడా ప్రణవి తెలిపింది. తాను ఇంటర్ చదువుతున్న సమయంలో ఒక మూవీకి పాట పాడటానికి వెళితే.. సినిమాకు సంబంధించిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అంతేకాకుండా సినిమాల్లో నువ్వు పాటలు పాడాలంటే తనతో ఉండాలంటూ కామెంట్స్ చేయడంతో చెప్పు తీసుకొని కొడతానని అక్కడే అతడికి వార్నింగ్ ఇచ్చేశానని ప్రణవి తెలిపింది.

అంతేకాకుండా ఆ విధంగా వచ్చే అవకాశాలు తనకు ఏమి అవసరం లేదని వెనక్కి తీరిగి వచ్చేశానని చెబుతూ.. తన ముందు ఎవరైనా ఆడవాళ్లని ఏమైనా అంటే వాళ్లను కొట్టేస్తానని చెప్పింది. దాంతో ప్రణవి చాలా డేరింగ్ గర్ల్ అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -