ఇటివలే సీనీయర్ నటుడు శరత్ బాబు నమితను పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఆమెతో సహజీవనం చేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 60 ఏళ్ల పైగా వయసున్న శరత్ బాబుకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. అందులో ఇద్దరితో విడాకులు కూడా అయ్యాయి. అలాంటి వ్యక్తి మళ్లీ నమితతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారనే వార్తలు అందరినీ షాక్‌కు గురి చేశాయి.
స్పందించిన శరత్ బాబు ఈ వార్తలను శరత్ బాబు ఖండిచారు. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. తాను నమితను కలిసి 8 ఏళ్లు అయింది. అలాంటపు తమ మధ్య ఏదో ఉందని చెప్పడంలో అర్థం లేదని ఆయన చెప్పారు. ఈ రూమర్స్ విని కొందరు తనపై దారుణమైన కామెంట్స్ చేశారని ఆయన అన్నారు. అసలు మళ్ళీ పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికంటే ముందుగా మీడియాకు చెబుతాని అని తెలిపారు. నాకు సంబంధం లేకున్నా అనవసర విషయాల్లోకి నన్ను లాగి వార్తలు సృష్టించి తన క్యారెక్టర్ ని దెబ్బ తీస్తున్నారు అంటూ శరత్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో శరత్ బాబు ప్రముఖ నటి రమా ప్రభను, స్నేహ లతా దీక్షిత్ లను పెళ్లాడారు. ఈ ఇద్దరితోనూ ఆయన విడిపోయారు. తర్వాత శరత్ బాబు మూడో వివాహం కూడా చేసుకున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయనకు వివాహానికి సంబంధించి ప్రశ్న ఎదురు కాగా… భార్య పేరు చెప్పేందుకు నిరాకరించారు. నా భార్యపేరు మిస్సెస్ శరత్‌బాబు అని మాత్రమే చెప్పుకొచ్చారు.
