Thursday, May 2, 2024
- Advertisement -

రండి బాబూ రండి..అమ్మ‌లారా.. వ‌చ్చేయండి.. నాయ‌కుల స్థాయిని బ‌ట్టి ప్యాకేజీలు ఇవ్వ‌బ‌డును..

- Advertisement -

ఏపీలో పార్టీ ఫిరాయింపుల‌కు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రాష్ట్ర సీఎం చంద్ర‌బాబు నాయుడే వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. తెలంగాణలో తమ పార్టీనిపూర్తిగా అక్కడి అధికార పార్టీ కొల్లగొట్టిన సమయంలో, చంద్రబాబు ఆవేదనాభరితంగా వ్యాఖ్య‌లు చేశారు. టీ రాజకీయ వ్యభిచారమనే విమర్శలు చేసేసి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్టీ ఫిరాయింపుల్ని ఎడా పెడా ప్రోత్సహించేశారుబాబుగారు.

పార్టీ ఫిరాయింపుల‌ను చూస్తుంటె సంత‌లాగా త‌యార‌య్యింది. సంత‌లో ప‌శువుల‌ను కొనుగోలు చేయ‌డం సాదార‌న‌మే అయినా ఏపీలో మాత్రం రాజ‌కీయ నాయ‌కుల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్లు కొంటున్నారు. నాయ‌కుని స్థాయిని బ‌ట్టి వాళ్ల‌కు వివిధ ర‌కాల తాయిలాల ప్యాకేజీల‌ను సిద్ధం చేస్తున్నారు. చూస్తుంటె ప‌శువుల‌కంటె హీనంగా దిగ‌జారింది మ‌న రాజ‌కీయ‌నాయ‌కుల ప‌రిస్థితి.

ఒక్కో ఎమ్మెల్యేకి పది నుంచి పాతిక కోట్ల దాకా ‘ప్యాకేజీలు’ సెట్‌ చేసిన చంద్రబాబు, ఎంపీలకు ఏకంగా 50 నుంచి 100 కోట్ల దాకా ప్యాకేజీల్ని సెట్‌ చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీలో చేరలేదు.. కానీ, వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పేశారామె. తాజాగా బుట్టా రేణుక కూడా అంతే. చంద్రబాబుకి మద్దతిచ్చారామె, ప్రస్తుతానికి టీడీపీలో చేరలేదు అదో సస్పెన్స్‌.

రాజధాని అమరావతి కట్టేశారు, విశాఖకి రైల్వే జోన్‌ తెచ్చేశారు.. ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ తెచ్చేశారు.. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ప్రకటించేశారు.. ఇంకా చాలా చాలా చేసేశారు గనుక, టీడీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు వచ్చేయాలట.. నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు వచ్చేయమంటున్నారంటే ఆయ‌న గురించి మాట్లాడాల్సిన ప‌నిలేదు.

ఒక పార్టీ త‌రుపున గెలిచి అభివృద్ధిఅనే ముసుగు వేసుకొని పార్టీ ఫిరాయించె నాయ‌కులను ప‌శువుల‌తో పోల్చినా త‌క్కువే అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సంత‌లో ప‌శువుల‌ను కొన‌డ‌మే చూశాం..కాని ఇప్పుడు రాజ‌కీయ ప‌శువులను కొన‌డం కొత్త‌గా చెప్పుకోవ‌చ్చు. అధికార పార్టీ ఏకంగా ఇక్క‌డ రాజ‌కీయ ప‌శువుల‌ను కొన‌బ‌డును అని బోర్డు పెట్టుకుంటె ఇంకా మంచిది. రాజ‌కీయాలు ఎటువెల్తున్నాయో వాల్ల‌కే ఎరుక‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -