- నితిన్, రానా, రోహిత్‌లతో ప్రవీణ్‌సత్తార్ సినిమా
కథ బాగుంటే విజయం దానంతటే అదే వస్తుందని నమ్ముతూ గుడ్డిగా సినిమాలు తీసుకుంటూ ప్రవీణ్ సత్తారు వెళ్తున్నాడు. అతడు అనుకున్న మాదిరే సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. అయితే విజయం అనేది కలెక్షన్ల రూపంలో కాకుండా చూడొద్దు. చిన్న చిన్న సినిమాలు తీస్తూ మంచి విజయాలు అందుకున్న ప్రవీణ్ సత్తారు ముగ్గురు హీరోలతో ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. లవ్ బీఫోర్ వెడ్డింగ్ (ఎల్‌బీడబ్య్లూ), రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూరు టాకీస్ సినిమాలు చేశాడు. సరైన విజయాలు లేక నిరాశలో ఉన్న సీనియర్ నటుడు రాజశేఖర్‌తో తీసిన సినిమా గరుడవేగ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
గరుడవేగ తర్వాత ఎంతోమంది నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఏవీ ఒప్పుకోలేదు. తన ఆలోచనతో.. తాను అనుకున్న రీతిలో సినిమాలు తీయాలని నిర్ణయించుకొని ఆ విధంగా పనిచేస్తున్నాడు. అందులో భాగంగా ముగ్గురు హీరోలతో కలిపి ఓ సినిమా తీయాలని ఫైనల్‌గా అనుకున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో నితిన్, రానా నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ కథ విన్న వీరిద్దరూ థ్రిల్‌గా ఫీలయ్యారు. మరో నటుడి కోసం నారా రోహిత్‌ను సంప్రదించారంట.
ఈ ప్రాజెక్టుకు “3 కజిన్స్” అనే టైటిల్ అనుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు హీరోలు ఫైనలైతే ఆ తర్వాత ముగ్గురు హీరోయిన్ పాత్రల ఎంపిక ఉంటుందని అందరూ ఎంపికైన తర్వాత ఈ ప్రాజెక్టుపై ఫైనలయ్యే అవకాశం ఉంది.