Monday, May 6, 2024
- Advertisement -

ట్రోలర్ల నోరు మూయించిన సమీరారెడ్డి

- Advertisement -

తెలుగు అమ్మాయి సమీరా రెడ్డి గత కొంతకాలంగా ఏదో ఒక కారణంతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ప్రస్తుతం తన రెండవ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ను చూపిస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అభిమానులు మాత్రం ఈమెపై విరుచుకుపడుతున్నారు. ఆమె అందంగా లేదంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇవన్నీ విని విసిగిపోయిన సమీరారెడ్డి వారందరి నోళ్లు మూయించే విధంగా సమాధానం ఇచ్చింది. తన బేబీ బంప్ తో ఒక గ్లామరస్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి “సముద్రపు లోతుల్లో ఈత కొట్టగలిగే వారికి సైతం కష్టం అనిపించే లోతున్న మనసు తనది. నా ప్రెగ్నెన్సీ బెల్లీ ని చూసి ఇబ్బందిపడేవారు అందరికీ ఇదే నా సమాధానం” అని పోస్ట్ చేసింది సమీరారెడ్డి. ఇక ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెలివరీ తర్వాత తను మళ్ళీ సినిమాల్లోకి వస్తానని చెప్పిన సంగతి తెలిసిందే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -