Sunday, May 12, 2024
- Advertisement -

ప్రెగ్నెన్సీ వార్త‌ల‌పై స‌మంత వ్య‌ట‌కార స‌మాధానం చూశారా…

- Advertisement -

అక్కినేని సమంత ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతోంది. సమంతకు వస్తున్న అవకాశాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలే. హీరోయిన్ సమంత తన తర్వాతి సినిమా ‘ఓ బేబీ’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లలో సామ్ బిజీ బిజీగా గడుపుతోంది.సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ట్విట్టర్ ఐడీని బేబీ అక్కినేనిగా మార్చడంతో కొందరు నెటిజన్లు సమంత తల్లి కాబోతోందని, అందుకే ఐడీలో బేబీ అని చేర్చిందని ఎవరికీ వారే అనేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంత తల్లి కానుందననే పుకార్లు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇక ఇలాంటి వార్త‌ల‌కు చెక్ పెట్ట‌క‌పోతె ఇంకెత‌దూరం వెల్తుందోన‌ని ఆవార్త‌ల‌పై వ్య‌ట‌కారంగా స‌మాధానం ఇచ్చింది నెటిజ‌న్ల‌కు. పెళ్లి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో అభిమానులు వీరి నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. సమంతని ఓ వ్యక్తి ట్విట్టర్ లో ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నించగా.. ‘డామ్.. మీకు ఎవరు చెప్పారు.. నాకు తెలియపరచండి’ అంటూ సమాధానం ఇచ్చింది. అంతేనా ‘నేను గర్భం దాల్చినట్లు మీకు కనిపిస్తే… నాకు కూడా చెప్పండి” అంటూ వెటకారంగా రిప్లై ఇచ్చారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా సమంంత తనపై ఏదైనా తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తే వెంటనే స్పందిస్తారు. పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన అంశాలను కూడా పారదర్శకంగా ఉంచడం ఆమెకు అలవాటు. అందుకే తనపై వచ్చిన ప్రెగ్నెన్సీ రూమర్లను వెంటనే కట్టడి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -