- Advertisement -

ప్రముఖ దర్శకుడి కెరీర్ ముగిసినట్టేనా

- Advertisement -

దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారిన సంగతి తెలిసిందే. వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ మెగాస్టార్ కే దక్కింది. ఈ సినిమా తర్వాత వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఇంటెలిజెంట్’ అతిపెద్ద డిజాస్టర్ గా మారింది. బాక్సాఫీస్ వద్ద కనీసం నాలుగు కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయింది. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ పై కంటే వి.వి.వినాయక్ కెరీర్ పై బాగా నెగటివ్ ప్రభావం చూపించింది

ఇంటెలిజెంట్ సినిమా తర్వాత వి.వి.వినాయక్ మరే సినిమా కి దర్శకత్వం వహించలేదు. గతంలో వివి వినాయక బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తర్వాత వి.వి.వినాయక్ విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం వి.వి.వినాయక్ చేతిలో ఒక ఆఫర్ కూడా లేదు. ఇక ఇండస్ట్రీలో వి.వి. వినాయక్ కి అవకాశాలు ఉండవని, రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం కనీసం ఒక్క సినిమా చేసినా వి.వి.వినాయక్ మళ్లీ ఫామ్ లోకి వస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -