Thursday, May 2, 2024
- Advertisement -

తెలుగులోనూ ‘ప్రేమలు’ జోరు!

- Advertisement -

ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ ముందు చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. ఎన్నో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా తాజాగా ఓ మలయాళ బ్లాక్ బాస్టర్ కూడా ఇదే వరుసలో నిలిచింది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ప్రేమలు ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజ్ కాగా ఇప్పటివరకు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక మార్చి 8న తెలుగులో రిలీజ్ కాగా తెలుగులోనూ సత్తాచాటుతోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ. 3 కోట్లు రాబట్టగా రోజురోజుకు వసూళ్లు పెరిగిపోతున్నాయి.
గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించగా నెస్లేన్ గఫూర్, మిమితా బైజూ హీరోయిన్లుగా నటించారు. సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు ప్రేమలు సినిమాకు ఫిదా అయ్యారు.

ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించగా ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. తెలుగులో ఎస్ ఎస్ కార్తికేయ డబ్ చేసి రిలీజ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -