Tuesday, May 7, 2024
- Advertisement -

లిప్ లాక్‌తో రెచ్చిపోయిన‌ ప్రియా ప్రకాష్ వారియర్

- Advertisement -

క‌ళ్ల‌తో కూడా రొమాన్స్ చేయ‌వ‌చ్చని నిరుపించింది మళయాళ‌ భామ‌ ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క క‌న్ను కొట్టిన సీన్‌తో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది ప్రియా ప్రకాష్. ఈ సీన్‌తోనే నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించింది. ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే గూగుల్లో 2018లో ఈ భామ‌నే ఎక్కువుగా వెతికారు అంటే అమ్మ‌డి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రియా ప్రకాష్ వారియర్ మాళ‌యాళంలో న‌టించిన ఓరు ఆధార్ లవ్ సినిమాను తెలుగులో ల‌వ‌ర్స్ డే అనే పేరుతో డ‌బ్బింగ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. టీజ‌ర్‌లో హీరో రోషన్,హీరోయిన్‌ ప్రియా వారియర్ మాత్ర‌మే క‌నిపించారు. స్కూల్లో వీరిద్ద‌రు దొంగ చాటుగా క‌లుసుకుని మాట్లాడుకుంటారు. ఈ స‌మ‌యంలోనే ప్రియా వారియర్‌కు లిప్ లాక్ పెట్టేశాడు మ‌న హీరో. ఈ సీన్ టీజ‌ర్‌కే హైలెట్ అని చెప్పాలి. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రు మాట్లాడుకున్న మాట‌లు యువ‌త‌ను ఎక్కువుగా ఆక‌ట్ట‌కుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -