మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సీనీ ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తుంది. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చెరుకుంది.ఇప్పటికే టీజర్‌తో సోషల్ మీడియా సంచలనంగా మారిన ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఫస్ట్ వోథ్‌లోనే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవి సాంగ్స్‌కు కూడా అదే రీతిలో మ్యూజిక్ అందించడాని సమాచారం.కాగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ మొదటి వారంలో వైజాగ్‌లో నిర్వహించలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
వైజాగలో ఈవెంట్ జరిగితే మహేష్ బాబు సినిమా మొదటిసారి ఏపిలో జరుపుకుంటున్నదిగా నిలిచిపోతుంది. కొరటాల-మహేష్-దేవి శ్రీ కాంబినేషన్‌లో గతంలో విడుదలైన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ‘భరత్ అనే నేను’ మూవీపై విపరీతమైన అంచనాలు వచ్చేశాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ జోడి కడుతుండగా.. ప్రకాష్ రాజ్ విలన్‌గా నటిస్తున్నారు.
