Monday, May 20, 2024
- Advertisement -

అఖిల్‌తో రొమాన్స్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియ‌ర్

- Advertisement -

ఒక్క క‌న్ను కొట్టే సీన్‌తో నేషన‌ల్ లేవ‌ల్లో ఫేమస్ అయింది ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌.ఆమె న‌టించిన సినిమా ఒక్క‌టి కూడా విడుద‌ల కాక‌ముందే ప్రియాతో సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.ఈ మ‌ధ్య వ్యాపార ప్రకటనల‌లో కూడా దూసుకుపోతుంది ప్రియా.తాజాగా ఆమె అక్కినేని హీరోతో క‌లిసి ఓ వ్యాపార ప్రకటనలో కూడా న‌టించింది. సౌతిండియా షాపింగ్ మాల్ కోసం తీసిన ఓ వ్యాపార ప్రకటనలో అఖిల్‌,ప్రియా ప్ర‌కాష్‌లు కలసి నటించారు.

ఇక వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసిన వారంతా ఈ జోడీ బాగుందని కితాబిస్తున్నారు. కాగా, ప్రస్తుతం అఖిల్ ‘మజ్ను’ చిత్రంతో బిజీగా ఉండగా, ‘ఒరు ఆధార్ లవ్’ తరువాత ప్రియా వారియర్ మరో చిత్రానికింకా సైన్ చేయలేదని తెలుస్తోంది. వీరిద్ద‌రు యాడ్‌లో క‌నిపిస్తేనే ఇంత అందంగా ఉంటే క‌లిసి సినిమాలో న‌టిస్తే ఇంకా ఎంత బాగుంటుందో అని చ‌ర్చించుకుంటున్నారు సినీ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -