- Advertisement -

కాపుల కోసం ఎవరికి కోత విదిస్తావు బాబు ?

- Advertisement -

ఎప్పటి నుంచో ఊరిస్తున్న కాపుల రిజర్వేషన్ విషయంలో ఇన్నాళ్ళ తరవాత అడుగు పడింది అని ఆ కమ్యునిటీ వారు సంతోషంగా ఉన్నారు. ఎందఱో నాయకులు ఎప్పటినుంచో ఇస్తాం ఇస్తాం అంటూ ఉన్నారు తప్ప ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు మొత్తానికి ఈ టర్మ్ ముఖ్యమంత్రి అయిన తరవాత చంద్రబాబు నాయుడు కాస్త పరవాలేదు అనిపించారు. 

కనీసం సాధ్యాసాధ్యాల మీద కమీషన్ వేసి రిటైర్డ్ న్యాయమూర్తి ని నియమించాలి అని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇది చాలా ఘాటైన నిర్ణయం అని చెప్పాలి. ఈ నివేదిక కి తొమ్మిది నెలలు గడువు కూడా పెట్టారు. కాపుల రిజర్వేషన్ ఎంతో కొంత శాతం ఇవ్వాలి కాబట్టి దాని వలన ఇతరుల రిజర్వేషన్ లో కొత్త విధిస్తారా లేక జెనరల్ కేటగిరీ ని మరింతగా తగ్గిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ లో జెనెరల్  కేటగిరీ తగ్గిస్తే సామాన్యులు ఊరుకుంటారా అనేది చెప్పలేని పరిస్థితి.

మరే ఇతర రిజర్వేషన్ కేటగిరీ వాళ్లు ఆందోళన చెందక్కరలేదని, వాళ్ల వాళ్ల శాతాలు తగ్గించమని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ప్రభుత్వ ఎవరి రిజర్వేషన్లు తగ్గించకుండా అని చెబుతోంది కానీ, జనరల్ కేటగిరీని తగ్గించకుండా అని మాత్రం చెప్పలేదు. సో ఈ లెక్కన జెనెరల్ కి పెద్ద ముప్పు పొంచి ఉంది అని చెప్పాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -