బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవలే పెళ్లి చేసుకుంది. అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌తో గత కొంతకాలంగా ప్రేమయాణం నడిపిన ప్రియాంక ఎట్టకేలకు అతనినే పెళ్లి చేసుకుంది. వయస్సులోతన కన్నా 10 సంవత్సరాలు తక్కువ అయిన నిక్ జోనాస్‌ను పెళ్లాడటంపై ప్రియాంకపై చాలనే విమర్శలు వచ్చాయి. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వీరి వివాహం భారీ స్థాయిలో జరిగింది. ఇదిలా ఉంటే మిస్ జోనాస్ గా మారిన ప్రియాంక తాజాగా ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది.
ఈ ఫోటోషూట్‌లో ప్రియాంక రెచ్చిపోయింది.క్లీవేజ్ షోతో కుర్ర కారు గుండెల్లో ముల్లుగుచ్చింది ప్రియాంక. వోగ్ మ్యాగజైన్ జనవరి 2019 కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. ఈ జనవరి మ్యాగజైన్ లో ప్రియాంక లవ్ స్టొరీ.. తన కలల్లోని యువరాజును పెళ్ళి చేసుకోవడంపై కథనం కూడా ఉంది. ఈ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి అంటే ,ఆమె ఎంత హాట్‌గా కనిపించిందో అర్థం చేసుకోవాలి.అయితే ఈ విషయంలో ప్రియాంకను విమర్శించే వారు లేకపోలేదు.పెళ్లి తరువాత ఇలాంటి వేషాలు వేయం ఏంటీ అని ప్రియాంకను ప్రశ్నిస్తున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట