Tuesday, May 7, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా ఇప్పుడు మిస్ కాదు మిసెస్‌

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిన్న‌టితో(శ‌నివారం) త‌న మిస్ హోదాను పొగొట్టుకుంది.అవునండీ మీరు వింటుంది నిజ‌మే. ప్రియాంక చోప్రా త‌న బ్యాచిల‌ర్ జీవితానికి స్వ‌స్థి చేప్పి వివాహా జీవితంలోకి అడుగు పెట్టింది. అమెరికా పాప్ సింగర్‌ అయిన నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లాడింది ప్రియాంక‌. జోధ్ పూర్ నగరంలోని ఉమైద్ భవన్ ప్యాలెస్ హోటల్ లో కేథలిక్ క్రిస్టియన్ సంప్రదాయంలో నిక్ జోనాస్ – ప్రియాంక చోప్రాల వివాహం జరిగింది. ఈ క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన వివాహానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు.. ఇద్దరికీ రాల్ఫ్ లారెన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం జరిగింది.

ఈ రాల్ఫ్ లారెన్ స్పెషాలిటీ ఏంటంటే 2017 మెట్ గాలా ఈవెంట్ లో ఈ రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన దుస్తుల్లోనే తళుక్కుమని మెరిసి అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఈ రోజు(ఆదివారం) హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకోబోతున్నారు. నిక్ ప్రియాంక లు మొట్టమొదట 2016లో ట్విట్టర్ ద్వారా చాటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2017 ఎకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ లో ఇద్దరూ కలిశారు. ఇక ఆతర్వాత ఒకరికి ఒకరు నచ్చడంతో ఏడాది పాటు డేటింగ్ చేసి ఇప్పుడు ఒక్కటయ్యారు. నిక్ – ప్రియాంకలు పెళ్ళి తర్వాత ఢిల్లీ లో ఒకసారి.. ముంబైలో ఒకసారి భారీస్థాయిలో రెండు సార్లు రిసెప్షన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -