Wednesday, May 1, 2024
- Advertisement -

మెగా హీరో ప‌క్క‌న ఛాన్స్ కొట్టేసిన ర‌ష్మీక‌

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల హవా న‌డుస్తుంది. ఈ లిస్ట్‌లో మొద‌టి పేరు మాత్రం హీరోయిన్ ర‌ష్మీక మందన్న. ఇప్పుడు ఈ క‌న్న‌డ బ్యూటీకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచియం అయింది ర‌ష్మీక‌. విజ‌య్ దేవ‌ర‌కొండతో న‌టించిన గీతాగోవిందం ర‌ష్మీక‌కు సినిమాతో మంచి క్రేజ్ వ‌చ్చింది . తాజా సమాచారం ప్రకారం రష్మిక ఓ మెగా హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఇప్పటికే రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మంచి ఊపుమీద ఉన్న వరుణ్ ‘అంతరిక్షం’ తో ఈనెలలోనూ.. ‘F2’ తో సంక్రాంతి పండగకు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్ ‘జిగార్తాండా’ అనే తమిళ సూపర్ హిట్ రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాలో తమిళంలో సిద్ధార్థ్ పోషించిన పాత్ర వరుణ్ తేజ్ పోషిస్తుండగా లక్ష్మీ మీనన్ పాత్రకు రష్మికను ఫైనలైజ్ చేశారట. ఇప్పటిదాకా రష్మిక పోషించిన పాత్రలు ఒక ఎత్తు ఇది మరి ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ కు బంధువుగా షాపుల్లో దొంగతనం చేసే యువతి గా కనిపించనుంది. అసలే రష్మిక చలాకీ.. ఇక ఇలాంటి పాత్రలో రెచ్చిపోయి నటిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ లో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -