Friday, May 17, 2024
- Advertisement -

మెగా అల్లుడా.. మేం చేయ‌లేం

- Advertisement -

సుప్రీం హీరో సినిమాకు హ్యాండిచ్చిన నిర్మాత‌

విజయం వ‌స్తే అంద‌రూ ఉంటారు.. ఫెయిలైతే ఒక్క‌డే మిగులుతాడు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ నానుడి సినీ ప‌రిశ్ర‌మ‌కు డిట్టో స‌రిపోతుంది. సినిమా హిట్ట‌యితే అంద‌రూ వ‌స్తారు.. అదే ఫ్లాప‌యితే ఆ ఇంటికి ఒక్క‌రూ రారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని మెగా అల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఎదుర్కొంటున్నాడు. వ‌రుణ్ న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప‌య్యాయి. దాదాపు నాలుగు సినిమాలు డిజాస్ట‌ర్‌గా పేరు పొందాయి. కుటుంబ ప్రోత్సాహం లేక‌పోవ‌డం.. న‌మ్మిన‌వాళ్లు హ్యాండివ్వ‌డం త‌దిత‌ర వంటి కార‌ణాల‌తో సాయి కెరీర్ ప్ర‌మాదంలో ప‌డింది.

అయినా సాయి ఆందోళ‌న చెంద‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు మ‌రో రెండు, మూడు సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక సినిమా చేయాల‌ని ఇంత‌కుముందే ఒక నిర్మాత ఒప్పుకున్నాడు. అన్నీ అయిపోయి సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ ఈలోపు సాయి న‌టించిన ఇంటిలిజెంట్ ఒక్క‌రోజు కూడా థియేట‌ర్ల‌లో స‌రిగా ఆడ‌లేదు. ఆ సినిమా భారీ ఫ్లాపు అందుకోవ‌డంతో ఇప్పుడు సినిమా తీద్దామ‌న్న నిర్మాత నేను చేయ‌లేను.. వ‌ద్దు బాబోయ్ అని హ్యాండిచ్చేశాడు.

ఇంటిలిజెంట్ డిజాస్టర్‌తో నిన్నటివరకు అతడితో సినిమా తీయాలని నిర్మాత ఇప్పుడు హ్యాండిచ్చాడు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్‌తేజ్ డాన్ శ్రీను ఫేం డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఎప్పటి నుంచో ఓ స్ర్కిప్టు సిద్ధం చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ స‌మ‌యంలో నిర్మాత తాను సినిమా చేయలేనంటూ చెప్పేశాడు.ఎన్నాళ్ల నుంచో తేజు సినిమా కోసం స్రిప్టును తీర్చిదిద్దుతున్న ద‌ర్శ‌కుడు గోపీచంద్ నిర్మాత కోసం వెతుకులాలో ఉన్నాడు. ప్రస్తుతం సాయి కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -