Friday, May 3, 2024
- Advertisement -

నాని సినిమాలో మామ‌కోడ‌లు

- Advertisement -

రాజుగాదిగ‌ది-2 సినిమాలో మెరిసిన మామ కోడ‌లు ఇప్పుడు మ‌రో సినిమాలో క‌నిపించే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ నాని, అక్కినేని నాగార్జున క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు క‌థ సిద్ధ‌మై సెట్స్‌కు వెళ్ల‌డ‌మే ఆల‌స్యం. అయితే వీరిద్ద‌రికి జోడిల‌ను ఎంపిక చేయ‌డంలో ఆల‌స్య‌మ‌వుతోంది. వారిద్ద‌రి ప‌క్క‌న న‌టించేందుకు ప‌లు హీరోయిన్ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ఇప్పుడు నాగ్‌, నానికి హీరోయిన్ల ఎంపిక పూర్త‌యింద‌ని తెలుస్తోంది. అయితే వాళ్లిద‌రిలో నాగార్జున‌కు త‌మిళ్ హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేశార‌ని స‌మాచారం. నాని ప‌క్క‌న నాగార్జున కోడ‌లు స‌మంత‌ను న‌టించ‌డానికి ఎంపిక చేశారంట‌. మొద‌ట శ్ర‌ద్ధాను నానికి అనుకున్నా నాగ్ కోసం ఇచ్చేద్దామ‌ని డిసైడ‌య్యారు. ఆ త‌ర్వాత నాని ప‌క్క‌న నాగార్జున కోడ‌లు స‌మంత‌ను ఫిక్స్ చేశారంట‌. మామ కోడ‌లు క‌లిసి మొన్న రాజుగారి గ‌ది-2 సినిమా చేశారు. మ‌ళ్లీ ఆ త‌ర్వాత ఈ సినిమాలో క‌లిసి న‌టిస్తారో లేదో చూడాలి.

అయితే నాని న‌టించిన ఈగ సినిమాలో సమంత న‌టించింది. కొంచెంసేపు కనిపించినా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కటయ్యింది. దీంతో ఆ తరువాత వెంటనే ఆ జోడీని ప్రేమ కథల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరపై చాలా సేపు చూపించాడు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య రొమాన్స్ స్ట్రాంగ్‌గా క్లిక‌య్యింది. మ‌ళ్లీ ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో వీరిద్ద‌రూ క‌నిపించే అవ‌కాశం ఉంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -