- Advertisement -

డిస్ట్రిబ్యూటర్‌ని కొట్టిన బెల్లంకొండ‌?

- Advertisement -

నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు ఓ డిస్ట్రిబ్యూటర్‌ని కొట్ట‌ర‌నే వార్త సినీ ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆర్ధిక లావాదేవీలకి సంబంధించి ఓ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో డిస్ట్రిబ్యూట
ర్‌తో మాట్లాడానికి వెళ్లిన బెల్లంకొండ ,అక్క‌డ స‌హ‌నం కోల్పోయి,అత‌నిపై చేయి చేసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించారు బెల్లంకొండ‌. అలాంటిదేమీ జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. మరొక వ్యక్తిని నేను ఎలా కొట్టగలను..? నేను కొడితే అతడు చూస్తూ ఊరుకుంటాడా..? అని ప్రశ్నించాడు బెల్లంకొండ. నేను అంటే గిట్ట‌ని వారు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నార‌ని అంటున్నారు బెల్లంకొండ‌.అయితే డిస్ట్రిబ్యూటర్‌తో గొడ‌వ మాత్రం నిజ‌మేన‌ని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -