దిల్ రాజు ఇప్పడున్న తెలుగు నిర్మాతల ఒకరు.కెరీర్ మొదట్లో ఫ్యామిలీ,యూత్ సినినిమాలు నిర్మిస్తు తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజు.పెద్ద హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు కథలో కంటెంట్ ఉంటేనే సినిమాను నిర్మిస్తాడని పేరు సంపాదించాడు.సినిమా రిజల్ట్‌పై కూడా దిల్ రాజుకు మంచి గ్రిప్ ఉందనే టాక్.ఏ సినిమా హిట్ అవుతుందో ముందే చేప్పేయగలా సమర్థడు దిల్ రాజు.అయితే ఇటీవల కాలంలో దిల్ రాజుకు కాలం కలిసి రావడం లేదు. ఏ సినిమా తీసిన ప్లాప్ అవుతుంది.తన సొంత సినిమాలే కాక డిస్టిబ్యుట్ చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు దిల్ రాజు.అసలే ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న దిల్ రాజుకు ఇండస్ట్రీ నుండి మరో సమస్య ఎదరైంది.దిల్ రాజుకు ఇండస్ట్రీలో ఓ వ్యతిరేక వర్గం తయ్యారైంది.
దిల్ రాజు ఇండస్ట్రీ మొత్తం తనవల్లే నడుస్తుందన్న భావనతో బిహేవ్ చేస్తున్నాడని ఆయన వ్యతిరేక వర్గం వాదన.ఇండస్ట్రీలో ఏం చేసిన తనకు చేప్పే చేయలని కండిషన్ పెడుతున్నాడని సమచారం.అదే విధాంగా సినిమాల విడుదలలో కూడా దిల్ రాజు జోక్యం ఎక్కువైందని,డిస్ట్రిబ్యుషన్ విషయంలో కూడా అతిగా ప్రవర్తిస్తున్నారని కొందరు అభిప్రయపడుతున్నారు.ఇక తన సినిమాల విషయంలో దిల్ రాజు జోక్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దర్శకులను స్వేచ్ఛగా పని చేసుకోనివ్వరనే పేరు మొదటి నుండి దిల్ రాజుకి ఉంది.దిల్ రాజు ప్రవర్తనతో అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదు.దిల్ రాజు ప్రస్తుతం మహేశ్ బాబు 25వ సినిమాను నిర్మిస్తున్నాడు.దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆలోచించే పరిస్థితి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
