Thursday, May 16, 2024
- Advertisement -

సైరా సెట్ కూల్చివేత… రెవెన్యూ అధికారుల కొరడా

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరెకెక్కుతున్న సిినిమా సైరా నరసింహారెడ్డి. ఆ మూవీలో హీరో ఇంటికి సంబంధించిన సెట్ ను తెలంగాణ అధికారులు కూల్చేశారు. ఉదయం నుంచీ సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద చర్చ. ఎందుకు కూల్చేశారు ? చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ చేసిన తప్పేంటి ? కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు కొొరడా ఝలిపించింది అని ? ఒకటే ప్రశ్నలే ప్రశ్నలు. వీటికి అధికారులు చెబుతున్న సమాధానం ఏంటంటే…అనుమతులు లేకుండా సెట్ వేసుకుని షూటింగ్ జరుపుకుంటున్నారని. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ స్థలంలోనే ఇటీవలే రంగస్థలం షూటింగ్ పూర్తి చేసుకోవడం, సినిమా విడుదల, సూపర్ హిట్ కావడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఆ ప్రభుత్వ స్థలంలో మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ హీరోగా చారిత్రాత్మక కథతో సైరా నరసింహారెడ్డి మూవీని ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా సెట్టింగులు వేసిన భూమి ప్రభుత్వానిదని శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సెట్స్ వేసి షూటింగ్ చేయడం తప్పు అని చెప్పారు. ముందస్తు పర్మిషన్ అడిగితే ఉచితంగానే అనుమతులు ఇచ్చేవారమని చెబుతున్నారు. ముందుగా అనుమతి తీసుకోలేదు కదా…నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని, అందుకే సెట్స్ కూల్చి వేయాల్సి వచ్చిందని వివరించారు. నిజంగా అందుకే కూల్చేశారా ? అంటే మరో మాట కూడా చెప్పారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా చిత్ర నిర్మాతలు స్పందించలేదని మండిపడ్డారు. భూకబ్జాకు ప్లాన్ చేసుకునే ఏళ్ల తరబడి అక్కడ నుంచి కదలడం లేదని ఆరోపించారు రెవెన్యూ అధికారులు. మూడు నాలుగేళ్లుగా రంగస్థలం సిినిమా షూటింగ్ కోసం ఆ స్థలాన్ని చిత్ర నిర్మాతలు వినియోగించుకున్నారని గుర్తు చేశారు. ఆ మూవీ రిలీజైపోయినా, ఇంకా ఆ స్థలాన్ని ఖాళీ చేయకపోవడం భూ కబ్జాకు సంకేతాలేనని తేల్చి చెప్పారు. అనుమతుల్లేకుండా సెట్ వేసి, ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుని, ఆ తర్వాత ఆ భూమిని కబ్జా చేసుకోవాలనేది చిత్ర యూనిట్ ప్లాన్ అని అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే సెెట్ కూల్చేశామని తేల్చి చెప్పారు.

అయితే త్వరలో యూరప్ లో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చి, మళ్లీ ఇక్కడ సెట్స్ లో షూటింగ్ రీ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నారే తప్ప. భూ కబ్జా కోసమే ప్లాన్ చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్నది అందుకే…అని అధికారుల చేస్తున్న తీవ్రమైన ఆరోపణలపై చిత్రనిర్మాతలు ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే కోట్లు పెట్టి తీసే ఆ సినిమా సెట్టింగులకు ఇన్సూరెన్సులు చేయించే ఉంటారులే ? అని చెప్పేవాళ్లు ఉన్నారు. కానీ అనుమతులు తీసుకోకుండా, నోటీసులకు స్పందించకుండా ఉన్నారంటే… అధికారులు చెప్పిన భూ కబ్జా ఆరోపణలు నిజమేనా ?అని ఆలోచనలా పడాల్సి వస్తోంది. పోనీ సెట్ కూల్చేసినా నష్టపోయేది ఏమీ ఉండదని అంటున్నారు. ఎటూ రిలీజ్ తర్వాత ప్రభుత్వ అనుతులతో టికెట్లు అధిక ధరలకు అమ్ముకోవడం. బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలు పేరుతో ప్రేక్షకుల జేబులు ఖాళీ చేసే, తాము కోట్లు సంపాదించుకుంటారు కనుక నిర్మాతలకు వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ మెగా ఫ్యామిలీ భూకబ్జా కోరులు అనే ఆరోపణలు మాత్రం వారికి భారీ నష్టాన్నే కలిగిస్తున్నాయి. దీనిపై చిరంజీవి, రామ్ చరణ్, సహా పవన్ కళ్యాణ్ సైతం సమాధానం చెప్పుకోవాల్సిందే. లేదంటే ఇప్పటికే ఆయన పెళ్లిళ్లుపై విమర్శలు చేస్తున్నవారు రేపు పొద్దున్న ఈ భూ కబ్జా ఆరోపణలనూ ఉద్ధృతం చేస్తారు. సో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగనుందో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -