- Advertisement -

‘ఈనాడు’ పై దుమ్మెత్తిపోసిన వైకాపా ఎమ్మెల్యే!

- Advertisement -

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై దుమ్మెత్తిపోశాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.

గత కొన్ని రోజులుగా ఆ పత్రికలు గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించాడు. తను వైకాపాను వీడబోతున్నానని ఆ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని.. దీనికి పదిహేను రోజుల గడువును పెట్టి ఆ పత్రికలు ప్రచారాన్ని సాగిస్తున్నాయని ఆదినారాయణ రెడ్డి అన్నాడు.

అయితే తను వైకాపాను వీడే ప్రసక్తేలేదని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఆ పత్రికలు వార్తలను తను గమనిస్తున్నానని.. తన గురించి ఇలా ఎందుకు రాస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆదినారాయణరెడ్డి అన్నాడు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో ఆదినారాయణ రెడ్డి విషయంలో ఇటీవల కొన్ని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పత్రికల్లో ఆయన పేరును సూటిగా రాయలేదు కానీ.. ఆయనే అనే అనుమానాలు వచ్చేలా వార్తలు వచ్చాయి.

ఆదినారాయణ రెడ్డి వైకాపా ను వీడి తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్దం అయ్యిందని, జగన్ కు సొంత జిల్లాల్లో ఇదో తలనొప్పిగా మారతుందని ఆ పత్రికలు కామెంట్ చేశాయి. అవి వరసగా ఇచ్చిన కథనాలను బట్టి చేస్తూ.. ఆదినారాయణ రెడ్డి జగన్ పార్టీని వీడటం ఖాయమే నేమో అనే అభిప్రాయాలు కలిగాయి. అయితే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పత్రికలపై విరుచుకుపడ్డాడు. తను పార్టీ ని మారడం లేదని స్పష్టం చేశాడు. మరి ఇప్పుడు ఆపత్రికలు ఏమంటాయో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -